సోదర, సోదరీమణులారా....సోది చెప్తున్నానని అనుకొకుండా...
కాస్తా ఓపిక తెచ్చుకుని...ఘుప్పు ఘుప్పు మనే ఈ గొప్ప గాధ వినండి...
అనగనగా అలరించు కథ ఇది,
అనాగరికులకు తెలియని కథ ఇది,
అమ్రుతమేదో తెలియని వాళ్ళకు,
ఇదిగిదిగిదిగో సిగరెట్టు...
ఎన్నో అద్భుత ఆలోచనలకు,
అవసరమైన టేబ్లెట్టు...ఈ సిగరెట్టు
మహా మహా మహరాజులనైనా,
కట్టిపడేసే కనికట్టు...ఈ సిగరెట్టు
సకల కళా విశారదులెందరో,
తప్పక చూసే ఒక టేస్టు...ఈ సిగరెట్టు
ఆడే పాడే కుర్రవయసుకు,
ఎప్పటికీ modern stylistu...ఈ సిగరెట్టు
ఘుప్పు ఘుప్పు మని పొగలు వదిలితే,
గుప్పెడు గుండెకు గుబులు తగ్గదా...
పెదవుల నడుమన pipe నిలిపితే,
పెద్దల ఎదుటన పరువు పెరగదా...
హంగులు చేస్తూ రింగులూదితే,
చెంగు చెంగు మని పాప చెంత చేరదా...
కాబట్టి...
హాని హాని అంటూ కహానీలు చెప్పక,
హనీ హనీ అంటూ ఒక honey dewని అందుకో...
~james
No comments:
Post a Comment