నీ తీపి ఙాపకాలలో నా మనసు తప్పిపొయింది
ఈ చేదు అనుభవాలలో నా వయసు చిక్కుకుంది
తిరిగిరాని మనసు జాడ తెలిసినా,
కరిగిపొయే వయసు గోడు వినలేకున్నా,
మానలేక చేస్తున్నా మరల మరల నీ ధ్యానం,
మదనపడుతూ వేధిస్తున్నా నా వయసుని అనునిత్యం,
విలపించలేని కన్నులతో నా వేదన వివరిస్తూ,
విరహంతో మరిగే నా తనువు తపము చేస్తూ,
ఫలితం తేలని గెలుపు కోసం మనసరా పరుగెడుతూ,
ప్రణయం తెలిపే పిలుపు కోసం అనుక్షణం ఎదురుచూస్తూ,
నా నీడే నన్ను వీడి నీ తోడై నడిచొస్తున్నా,
నే ఒంటరి గా ఉంటూ నీ తలపులో తలమునకలవుతున్నా,
నా నయనం నిజమొదిలి నీ రూపం చూస్తున్నా,
నా హృదయం నన్నొదిలి నీ వైపే వస్తున్నా,
మదిలోన కొలువుంటూ నా ప్రాణం తీస్తున్నా,
సుతిమెత్తని చూపులతో నా గుండెను కోస్తున్నా,
దూరంగా ఉంటూనే ఎదభారం పెంచినా,
చేరువగా రాకుండా ఎంతో మురిపించినా
మౌనం తో హింసిస్తున్నా,
మాటలతో కవ్విస్తున్నా,
మత్తు చల్లి మైమరపిస్తున్నా,
కలలొ కనిపించినా,
కవితై కదిలొచ్చినా,
కన్నీరే మిగిల్చినా,
క్షణమొక యుగమై కదిలినా,
నా గుండె లయల గానం కొనసాగినంతకాలం,
నీ కొరకే నిరీక్షిస్తూ...
~james
No comments:
Post a Comment