విజయం నీదే, విజయుడవు నీవే,
సమరం చేసెయ్, నీ సత్తా చాటేసెయ్,
సలహా వింటూ సడలకు, నీ తరహా ఎపుడూ వదలకు,
కాలం ఎదురు తిరిగినా, కదనం జరుపుకో,
కలతలు ఎన్ని కలిగినా, కలవరపడక సాగిపో,
ఒడిదుడుకులకెపుడూ బెదరక, ఒటమి నుండి నేర్చుకో,
ఉచ్చులు ఎందరు పన్నినా, నీ వ్యూహాన్నే రచియించుకో,
అద్దంలో నిన్ను చూసుకో, అంతర్మధనం చెసుకో,
అంతే తెలియని ఆలోచనలతో ఆకాశాన్నే అందుకో,
పొగరు, తెగువ విడువకు, పొరపాటున కూడా జడవకు,
మంచి చెడు అని చూడకు, నీకు నచ్చని పనిని చెయ్యకు,
కన్నుల కత్తులు దూసుకుపో, కలగంటే వేటకు ముందుకుపో,
అవకాశం చేతులు జారనివ్వకు, అవరోధం నిన్ను ఆపనివ్వకు,
ఊహల దారిలో ఊగిసలాడక, ఊరికే కాలం వెళ్ళబుచ్చక,
ఉవ్వెత్తున ఎగిసే అలవై, నీ శక్తికి మించి పని చెయ్,
ఏదో అయిపోదామనుకుంటూ, ఎదురుచూస్తూ కూర్చోకు,
ఏదో చేద్దామనుకుంటూ, నీ ఆలోచనలను సంధించు,
ఎవరో అడ్డొస్తున్నారని, ఏడుస్తూ ఇక కూర్చోకు,
రాహువు, కేతువులెన్నున్నా పున్నమి వెన్నెల ప్రసరించు,
ఎదురొచ్చే మలుపులు తెలియని ప్రస్థానం జీవితం,
ఏదేమైనా సాధిస్తేనే తొలి స్థానం సాశ్వతం
~james
www.snehama.com idi choodandi baagundi mee blog laga ne...
ReplyDelete