నిన్న సాయంకాలం........
చిరు గాలుల సంగీతంలో....
చిరుజల్లుల సావాసంలో...
వెచ్హగా సిగరెట్ పొగలు వదులుతుంటే....
ఆ పొగల మబ్బులు విడిచే సరికి.......
కనిపించింది ఒక అమ్మాయి....
చిరుగాలుల సందోహంతో కదిలొచ్చెను ఆ రాగం...
చిరుజల్లుల సంగీతంలో వినిపించెను ఆ గీతం....
ఏ కవుల మదిలో మెదిలిన కల్పనో
ఏ శిల్పి ఉలి లో ఉదయించిన శిల్పమో
హరివిల్లులు జాలువార్చిన వర్ణమో...
కరిమబ్బులు కురిసిపొయిన వర్షమో...
ఏ తూరుపు నోచుకునే ఉదయమో...
ఏ చివురులు కోరుకునే వసంతమో...
ఏ తారలు తళుకుమనే నయనమో...
ఏ కలలను యెదుట నిలిపే చిత్రమో...
ఏ మదిలొ మంటలు పెట్టే మంత్రమో...ఏ యెదలొ అలజడి రేపే తంత్రమో...
ఏ మెఘం చాటున మెరుపో...నా కన్నుల ముంగిట మెరిసింది...
ఏ మబ్బుల మాటున చినుకో...నా హ్రుదయం అంచున కురిసింది...
బ్రహ్మ్మలు ఎందరు చెసారో
బ్రహ్మ్మచారులు ఎందరు వలచారో
భామలు ఎందరు వగచారో
భ్రమలో ఎందరు విహరించారో
మరల చూతునో లెదో...మరపురని సౌందర్యం...
మరుసటి జన్మలకైనా...మనసుని వదలని అందం...
~james
No comments:
Post a Comment