విరహాలు వీడిపోనీక
కలహాలు కరిగిపోనీక
కలలన్ని కదిలిపోనీక
కనులందు నిలిచిపోనీక
కరుణించక నన్ను కవ్వ్వించకే
మరణించిన నన్ను బ్రతికించకే
గతమంత మరిచిపోనీక
గురుతేది చెరిగిపోనీక
గాయాలు మాసిపోనీక
గుండెల్లో బరువు దిగనీక
ఊరించుతూ నన్ను వేధించకే
ఊపిరితోనే నన్ను ఉరితీయకే
హ్రుదయన్ని తేరుకోనీక
ఉదయాన్ని చూసుకోనీక
సమయాన్ని సాగిపోనీక
గమ్యాన్ని మార్చుకోనీక
గెలిపించక నన్ను గమనించకే
సాధించని నన్ను సాధించకే
~james
No comments:
Post a Comment