ఆ బ్రహ్మ దేవుడికి ఫొనుంటే,
ఆ నంబర్ నాకు తెలిసుంటే,
ఒక్క సారి డయల్ చేసి అడిగే వాడిని,
నీకు మనస్సు ఎందుకు పెట్టలేదని,
నా తపస్సు సంగతి ఎమిటా అని,
అందంగా నిన్ను తీర్చిదిద్దాడు,
అందరికీ నచ్చేలా చేసి ఉంచాడు,
వెన్నెల కాంతులు తెచ్చి నీ కన్నుల్లో నింపాడు,
మల్లెల పరిమళమంతా నీ నవ్వుల్లో ఉంచాడు,
నిశి రాతిరి చీకటినంతా నీ కురులలోన దాచాడు,
ఎన్నెన్నో తేనెలు తెచ్చి నీ మాటలలో కలిపాడు,
ఉందా, లేదా అన్నట్టు, వయ్యారంతో ఉండేట్టు నీ నడుమును చేసాడు,
ఆహా, ఓహో అన్నట్టు, అంతా థక్కున చూసేట్టు నీ నడకకు నాట్యం నేర్పాడు,
పసుపు, గంధం తో పాటు, వెన్న జున్ను కలిసేట్టు నీ మేనికి రంగులు దిద్దాడు,
పువ్వులు నవ్వులు రువ్వేట్టు, పురుషుడు పుట్టుక మరిచేట్టు, నీ సొగసుకు సోయగమద్దాడు,
రెందు చుక్కల సుధలు తెచ్చి అధరాలుగా మార్చాడు,
ఎన్నో చక్కని కెంపులు తెచ్చి చెక్కిలిపై నిలిపాడు,
కరి మబ్బును తెచ్చి కాటుకగా చేసాడు,
హరివిల్లును తెచ్చి హారంగా మలిచాడు,
ప్రాయంతో పరువాలన్నీ పధ్ధతిగా ఎదిగేలా,
తప్పులు ఏమీ చెయ్యక, తలతిక్కగ నిన్ను చెయ్యక,
తనువు మరిచి, తపము చేసి చేసాడు,
తరుణీమణులు ఎవ్వరైనా నీకు తక్కువయ్యేట్టు చేసాడు,
నిన్ను చేసినవాడు, నీకు ఇన్ని చేసిన వాడు,
నిన్ను చేసినప్పుడు నిద్దుర మానాడో ఏమో,
నీ బొమ్మను భూమికి పంపించి నా నిద్దుర చెడగొట్టాడు,
నీకు ప్రాణం పోసే ముందర మనసు పెట్టడం మరిచాడు,
నా ప్రాణం తీసేటందుకే, నా మనసు నీకు దోచి పెట్టాడు
~james
బాగుంది.
ReplyDeleteప్రేమ గురించి బోలెడన్ని కవితలు చదివాను. కానీ మీ కవిత కొత్తగా ఉంది. చివరి వరకూ ఆసక్తిగా చదివించింది. Good job!
-మురళి
thank you mr.murali...
ReplyDelete