నీ తలపుల తూరుపులో రవి గా నే ఎదిగాను
ఆ విరహపు ఓరుపులో కవి గా నే మిగిలాను
నీ కన్నుల కాంతులకై చీకటిలో నిలిచాను
ఆ వెన్నెల కరువైతే నిశిలోనే నలిగాను
నీ మాటల మధురిమకై ఆశగా నే వేచాను
ఆ మాధుర్యం ఇక అందదని మౌనంగా నే మిగిలాను
నీ రూపం కనిపిన్స్తుందని కలలో నే వెదికాను
ఆ యోగం లేని కన్నులను రెప్పలలో నే దాచాను
నీ హ్రుదయం నాదేనని ఊహల్లో నే నిలిచాను
ఆ ఉదయం ఇక రాబోదని ఊపిరినే నే నిలిపాను
~james
No comments:
Post a Comment