నా కంటికి గాని camera ఉంటే,
నీ ప్రతి కదలికని capture చేసెయ్యనా...
నా గుండెల్లోనా గుడి గాని ఉంటే,
నీ బొమ్మని ఉంచి కొలువే చేసెయ్యనా...
నా ఊహకి గాని ఊపిరి ఉండుంటే,
నీ లాంటి పిల్లని తెచ్చి నీ ముందే నిలిపెయ్యనా...
నువ్వంటే అంత ఇష్టం
నువు లేకుంటే life కష్టం
నువు అవునంటే నాదే కాదా అదృష్టం
నా మనసుకి గాని మాటే ఉండుంటే
నీ ప్రతి అందాన్నీ వర్ణించెసెయ్యనా
నా వయసుకి గాని ఒపిక ఉండుంటే
నీ వెనకే ఉంటూ వేధించేసెయ్యనా
నా వలపుకి గాని గెలుపే ఉండుంటే
నీ తలపులనే తరిమి తరిమి నీ వలపే గెలిచెయ్యనా
నువ్వంటే అంత ఇష్టం
నువు లేకుంటే ఎంతో కష్టం
నువు కాదన్నావంటే నీకే కాదా నష్టం
u r key to my heart,
key to my soul,
key to my every thought,
కీ కీ కీ కీ కీర్తన
నా గుండె లయల సంకీర్తన...
నీ మనసులోన ఖాళీ ఉండుంటే
నన్నే తెచ్చి, నీకే ఇచ్చి, నిన్నే మెప్పించి, ఆ ఖళీ పూరించెయ్యనా
~ james