ఒలె ఒలె ఒలె రాకాసి,
ఇలా ఇలా రా నాకేసి,
నీకై నీకై తెగ thinkఏసి,
చెప్పాలంటే కొంచం జంకేసి,
ఇలా చెప్దామని planఏసి,
ఏదో రాద్దామని ట్రై చేసి,
నాకు తెలిసిన అక్షరాలు కలిపేసి,
నా మనసు చెప్పిన లక్షణాలు నింపేసి,
ఊపిరంతా నిండి ఉన్న ఊహలు పోగేసి,
పెదవి చివరనే వణుకుతున్న ఊసులు పొదిగేసి,
నీ నవ్వుల సడికే సిగ్గుపడే పువ్వులు జత చేసి,
రివ్వున ఎగిరే గుండె గువ్వకే లేఖను ఇచ్చేసి,
వెన్నెల కురిసే చల్లని వేళను చూసి,
నీ పెదవుల కురిసే నవ్వుల వానలో తడిసి,
లేక లేక రాసిన లేఖను మరోసరి చూసి,
తప్పులు, తలతిక్కలు ఉంటే తొలగించేసి,
ముత్యమంత ముద్దులు కొన్ని మూట కట్టేసి,
మూడ్ మారేలోపు, నువ్వు మూతి ముడిచే లోపు,
నీకిమ్మని చెప్పానే ప్రేయసి,
అధర మధురాల, నయన గగనాల,
సుడుల జఘనాల, పడుచు పరువాల,
విరి సొగసుల, అర విరిసిన, అంద చందాల రాక్షసి...
~james
నువ్వు రాసిన ఈ రాతలు చదివేసి...
ReplyDeleteనాకెంతగానో నచ్హేసి...
అటు ఇటు ఎవరూ లేకుండా చూసేసి...
నా పొగడ్తలూ, ఆనందం, అభినందనలు కలబోసి,
నువ్వు కెవ్వు, కేకలెహై... అని సెప్పేతున్నడోసి.... "శ్రీను గాడు"...