Monday, February 9, 2009

చెలియా, సఖియా

నన్నే కదిలించిన కలవా,
నాలో ఉదయించిన కళవా,
నాకై నడిచొచ్చిన వెన్నెలవా,

చెలియా, చెలియా, నీ రాక కాదు కద మాయ
సఖియా, సఖియా, నీ ఉనికి మార్చింది గుండె లయ

మొద్దు మొద్దుగా నిదరోతున్న మనసుని తట్టి లేపావు,
పిచ్చి పిచ్చిగా పరుగెడుతున్న ఊహల దారులు మార్చావు,
కనుమరుగైన కొరికలెన్నో కొత్త కొత్తగా చూపావు,
వేస్టైందేమో అనుకుంటున్న వయసుకు అర్థం చెప్పావు,

చెలియా, చెలియా, నీ జంట ఇంత హాయా
సఖియా, సఖియా, మైనే తుఝ్కో ప్యార్ కియా

అరవిరిసిన అందానికి నువ్వే అద్దంలా కనిపించావు,
విరబూసిన కుసమంలా నీ దరహాసం అందించావు,
అలలెగసిన మది సంద్రంలో అలజడి మాయం చేసావు,
కలలెగసిన ప్రతి నిద్దురలో కలవరింతగా చేరావు,

చెలియా, చెలియా, నీ తోడు ఇంత 'లక్కీ'యా
సఖియా, సఖియా, నాలో దిగులంతా గాయబ్ హోగయా
~james

1 comment: