కరగని శిల ఇది, కదిలిస్తావా
కలగని కల ఇది, కదిలొస్తావా
మరువని కధ ఇది, మారుస్తావా
రగిలే చితి ఇది, మళ్ళీ చిగురించేల చిరునవ్వులు కురిపిస్తావా
వస్తావా, నిజమై
వరమిస్తావా, ఒకే ఒక రుజువై...
చీకటి గది ఇది, వెలుగిస్తావా
కన్నీరింకిన కొలను ఇది, వలపు ధారపోస్తావా
ఎడారి బతుకు ఇది, ఎండమావివౌతవా
మూగబోయిన మాట ఇది, మళ్ళీ వినిపించేలా చిరు ఆశలు కలిగిస్తావా
వస్తావా, నిజమై
వరమిస్తావా, ఒకే ఒక రుజువై...
నా మనసిది, మనసిస్తావా
ఓడిపోతున్న వయసిది, గెలిపిస్తావా
గెలిపించే ప్రయత్నం చేస్తావా
వస్తావా, నిజమై
వరమిస్తావా, ఒకే ఒక రుజువై...
~james