Monday, January 5, 2009

ఏమో ఏమో ఇది...

నిన్న, మొన్న లేనిది,
ఈ రొజే మొదలైనది

కలలో, ఇలలో కననిది
కన్నుల్లో కొలువైనది

నాలో నాకే తెలియనిది,
ఏదేదో అవుతున్నది

ఏమో ఏమో ఇది, ఏమేమో చేస్తున్నది
ఏమో ఏమో ఇది, నా వైనం మార్చేస్తున్నది...

కొత్త కొత్తగా కలవరింత ఇది,
మెత్త మెత్తగా ఎదను గిల్లినది

పిచ్చి పిచ్చిగా పులకరింత ఇది,
పచ్చి పచ్చి గా మనసు ఉరికినది

నన్నే నాకు కొత్తగా పరిచయం చేస్తున్నది
నాలో నాకే తెలియని పరవశం మొదలవుతున్నది

ఏమో ఏమో ఇది, ఏమేమో చేస్తున్నది
ఏమో ఏమో ఇది, నా వైనం మార్చేస్తున్నది...

చిలిపి చిలిపిగా కొంటె తలపు ఇది,
వలపు మలుపుగా మదిని చేరినది...

గొడవ గొడవగా గుండె గుబులు ఇది,
తడవ తడవగా తడిమి పొయినది...

నాకే తెలియని "సృజన", నాలో మేల్కొన్నది...
నిజమయ్యే కలననిపించి, నన్నే మురిపిస్తున్నది...

ఏమో ఏమో ఇది, ఏమేమో చేస్తున్నది
ఏమో ఏమో ఇది, నా వైనం మార్చేస్తున్నది...


~james